రేవంత్ రెడ్డి సర్కార్ రూ.4,500 కోట్ల స్కాం.. కేటీఆర్…

రేవంత్ రెడ్డి సర్కార్ రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని మా ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారని ఆధారాలు బయటపెట్టారు..కాళేశ్వరం కొట్టుకుపోయింది…, లక్ష కోట్ల స్కాం అని మాట్లాడి ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మూసీ లో కలుపుతం అంటున్నారని ఆగ్రహించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు. మూసీ ప్రాజెక్ట్ కు టెండర్లు పిలుస్తామని మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. మూసీ మాత్రం ఆఘమేఘాల మీద టెండర్లు అంటున్నడు. రైతులకు అందాల్సిన రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీకి తులం బంగారం లేదు, రైతు బీమా లేదు రైతులను ఇబ్బంది పెడుతుండు. బీఆర్ఎస్ హయాంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని వివరించారు..

హైదరాబాద్‌కు నీళ్లు తీసుకురావటానికి సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదని అన్నారు. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టిందని మండిపడ్డారు. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ గతంలోనే డిమాండ్ చేశానని అన్నారు. ప్రమాదంపై జ్యుడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్ చేయాలని అడిగానని అన్నారు. మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు ఈ ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారని అన్నారు. మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని.. అంతేకానీ కంపెనీని బ్లాక్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ నేత వివేక్ వెలుగు పేపర్ లోనే మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు లేవని రాశారని గుర్తుచేశారు. నేటికి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ.. సుంకిశాల అయోమయమంటూ కాంగ్రెస్ నేత పత్రికలోనే వార్త వచ్చిందని చెప్పారు..