రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్..బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
eleti maheshwar reddy comments on rahul gandhi
రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్.. మరి ఈయన హిందువా, ముస్లిమా ? చెప్పాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు…ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. తెలంగాణ రాష్ట్ర పర్యటనపై కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ ఘండి అన్నారు.
రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ ఘండి అయితే… రాహుల్ హిందువో.. ముస్లీమో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఫిరోజ్ జహంగీర్ ఘండి మనవడు రాహుల్ జహంగీర్ ఘండి కావాలి కదా అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్నారని రాహుల్ కులం, మతం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కోరారు. లేకపోతే.. ఇలాంటి డ్రామాలు ఆడకుండా.. ఇంట్లో కూర్చోవాలని చురకలు అంటించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.