అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన 8 మంది చంపాలి అనుకున్న దంపతులు..
మొయినాబాద్ ఫామ్ హౌస్లో జంట మహిళల హత్య కేసులో వీడిన మిస్టరీ
అప్పులు ఇచ్చిన వాళ్ళని మొత్తం ఎనిమిది మందిని చంపేందుకు ప్లాన్ చేసిన కరీమాబీ దంపతులు
అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వాళ్లనే చంపేస్తున్న దంపతులు
ముందుగా ఎనిమిది మందిలో ఇద్దరిని హత్య చేసిన కరీమాబీ దంపతులు
మరో ఆరుగురిని కూడా చంపేందుకు ప్లాన్ చేసి ఫామ్ హౌస్కు పిలవగా.. కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులు ఆశ్రయించిన ఆరుగురు మహిళలు
డబ్బులు ఇస్తానని చెప్పి ఫామ్ హౌస్కి పిలిచి తాండూరుకు చెందిన మహిళల్ని చంపేసిన కరీమాబీ..
ఇటీవలే మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్య వార్త తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర్తించారు….పైనాన్స్ డబ్బుల విషయంలో ఈ హత్య జరిగినట్టుగా భావించిన పోలీసులు.. దుండగులు డబ్బులు ఇస్తామని ఇద్దరు మహిళలను పిలిపించి హత్యచేసినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జంట మహిళల హత్య కేసులో నెలకొన్న మిస్టరీ వీడింది.
కరీమాబీ దంపతులు అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన 8 మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లని మొత్తం 8మందిని చంపేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కరీమాబీ దంపతులు అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వాళ్లనే చంపేస్తున్నట్టుగా నిర్దారించారు. తాము టార్గెట్ చేసిన ఎనిమిది మందిలో ఇద్దరిని హత్య చేసిన కరీమాబీ దంపతులు మరో ఆరుగురిని కూడా చంపేందుకు ప్లాన్ చేసి ఫామ్ హౌస్కు పిలిచారు. అయితే కరీమాబీ దంపతుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు పోలీసులు ఆశ్రయించడంతో తాజా విషయం వెలుగులోకి వచ్చింది..