అంచనాలు పెంచిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా…!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. జూన్ 4న పెద్ది సినిమా పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కాబోతుండటంతో ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టారు..క్రమంలో నేడు పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసారు. ముంబైలో పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు..బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది…

https://youtu.be/sF2dj7ycZvA?si=xnpS8iG6-FbXOj0L