చనిపోయిన కొడుకు మళ్లీ బ్రతుకుతాడని,,మృతదేహం దగ్గరే ప్రార్థన..

చనిపోయిన కొడుకు మళ్లీ బ్రతుకుతాడని,
ఓ తల్లి ఐదు రోజులుగా మృతదేహం దగ్గరే ప్రార్థన చేస్తుంది. కొడుకు శవం గుండెల పై బైబిల్ పెట్టి, ఎప్పుడు లేచి వస్తాడా అని ఎదురు చూస్తోంది. ఈలోగా శవం కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లడంతో, ఆ ఇంటికి పాలు పోసి వ్యక్తి స్థానికులకు తెలియజేశారు. దీంతో పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విధషాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. మరియమ్మ వర్గీస్ అనే రిటైర్డ్ టీచర్ కు షీను వర్గీస్ అనే 42 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతనికి వివాహం కూడా కాలేదు. ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు .ఆమె తన పెన్షన్ డబ్బులతో కాలం గడుపుతోంది. ఐదు రోజుల క్రితం అతడు చనిపోయి ఉంటాడని చెబుతున్నారు. తన కొడుకు దేహంలో ప్రభువు మళ్ళీ ప్రాణం పోస్తాడని, అతడు బతుకుతాడని ప్రార్థనలు చేస్తున్నానని. ఆమె పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు ఆమెకి నచ్చజెప్పి మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టంకు తరలించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉండదని స్థానికులు ఎవరితో కూడా కలవదని, ఒంటరిగానే ఇంట్లో ఉంటుందని ఇరుగుపొరుగు వారు చెప్పారు.