కంటైనర్ లారీని వెనుక నుంచి మరో లారీ..!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH65)పై హయత్‌నగర్‌ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కంటైనర్ ఒక వైపు చీలిపోగా, వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది.

దీంతో హైవేపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్షతగాత్రుడిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డులోకి మళ్లిస్తున్నారు.