IPL 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది.
పరుగుల వరద పారే ఐపీఎల్లో తాజా సీజన్లో భారీగా పరుగులు వచ్చాయి. సిక్సర్లు, ఫోర్లు దంచికొడుతుండడంతో గ్రౌండ్ చిన్నబోతున్నది. కొట్టిన బంతులన్నీ బౌండరీ లైన్ దాటిపోతున్నారు..బ్యాటర్ల పవర్ హిట్టింగ్తో ఐపీఎల్ 2026 సీజన్లో సిక్సర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో భాulరీగా సిక్స్‌లు నమోదయ్యాయి. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీతోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పులి అభిషేక్ శర్మ ఇలా టాప్ బ్యాటర్లు అందరూ భారీగా సిక్సర్లు కొడుతున్నారు..
సీజన్లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో బీభత్సం సృష్టించాడు. అతడి టార్గెట్ బౌండరీ అన్నట్టు ఆడుతున్నాడు. దీంతో 2026 సీజన్లో భారీ ఎత్తున సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 60 సిక్సర్లు నమోదు చేసి టాప్‌లో నిలిచాడు. పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సీనియర్ ఆటగాళ్లను తోసేసి వైభవ్ తొలిస్థానంలో నిలిచాడు. గతంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును వైభవ్ తిరగరాశాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా 59 సిక్సర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.
ఒక సీజన్లో పవర్‌ప్లే పూర్తయ్యేసరికి అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన మూడో ఆటగాడి ఆండ్రె రస్సెల్ నిలిచాడు. 2019 ఐపీఎల్ సీజన్లో రస్సెల్ 52 సిక్సర్లు బాదాడు. ఇక క్రిస్ గేల్ 2023 సీజన్లో 51 సిక్సర్లు కొట్టి ఆ సీజన్ సిక్సర్ల హీరోగా నిలిచాడు. ఐపీఎల్ 2022 సీజన్లో జోస్ బట్లర్ 45 సిక్సర్లు బాది ఆ సీజన్ సిక్సర్ల వీరుడిగా గుర్తింపు పొందాడు. పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఏడు సిక్సర్లతో సనాథ్ జయసూర్య ఉన్నాడు. 2008లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున జయసూర్య రికార్డు నెలకొల్పాడు.
RRతో జరిగిన ఎలిమినేటర్‌లో SRH 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యఛేదనలో RR బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది…అభిషేక్(0), హెడ్(17), ఇషాన్(33) వికెట్లు పడగొట్టి ఆర్చర్.. SRH పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో RR.. ఈ నెల 29న GTతో జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.