“నా కూతురు వల్ల పరువు పోతుంది.. ఆమెను చంపేయ్”
ప్రియుడితో కన్న కూతురిని హత్య చేయించిన తండ్రి
హన్మకొండ జిల్లాలో కారులో మహిళ మృతదేహం దొరికిన ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు
ఎల్కతుర్తిలో ఓ కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు
మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తింపు
మానసకు గతంలో రెండు వివాహాలు జరిగి విడాకులు అయ్యాయని, ఇప్పుడు ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్‌తో సహజీవనం చేస్తుందని గుర్తించిన పోలీసులు
గతవారం అరుణాచలం వెళ్తున్నానని చెప్పి వినోద్ గదికి వచ్చి, తనను పెళ్లి చేసుకోవాలని వినోద్‌ను బలవంతపెట్టిన మానస..
దీంతో మానస తండ్రికి ఫోన్ చేసి విషయమంతా చెప్పిన వినోద్..
తన కూతురు వల్ల పరువు అంతా పోతుందని, తనను చంపేసి ఇబ్బంది లేకుండా చూడాలని వినోద్‌కు చెప్పిన మానస తండ్రి..
ఈ నేపథ్యంలో వినోద్ మానస గొంతు నులిమి హత్య చేసి, కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి పాతిపెట్టాలని చూడగా, దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..
భయంతో మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లగా, ఎల్కతుర్తి శివారులో వినోద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..