బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ అక్వాన్.
ఏపీ, ఒడిశా తీరాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
గత 6 గంటల్లో గంటకు 5 కి.మీ. వేగంతో కదలిక.
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్ర తుఫాన్ అక్వాన్.
నర్సాపూర్‌కు 470 కి.మీ. కళింగపట్నానికి 490 కి.మీ..
చెన్నైకి 560 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకరణ..
గోపాల్‌పూర్‌కు 580 కి.మీ. దూరంలో అక్వాన్
రేపు నర్సాపూర్-పూరి మధ్య తీరం దాటే అవకాశం.
ఉత్తరాంధ్ర, యానాంపై తుఫాన్ ప్రభావం
దక్షిణ ఒడిశా తీరానికి తుఫాన్ ముప్పు
తీరం దాటే సమయంలో 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..
తీర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ మెసేజ్ జారీ
అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత ప్రజలకు సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. మొదట ఏపీ వైపు దూసుకొస్తుందని భావించిన ఈ తుపాను.. ఇప్పుడు ఒడిశా వైపు దిశ మార్చుకుంది. అయినప్పటికీ ఏపీకి ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు…
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు ‘అక్వాన్’ తీవ్ర తుఫాన్ క్రమంగా కదులుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుఫాన్ గత ఆరు గంటలుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు…
గంటకు 100కి.మీ వేగంతో గాలులు :
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. తుఫాన్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. నరసాపురం, కళింగపట్నం, గోపాల్పూర్ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమైంది…రానున్న గంటల్లో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా.. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు…