సొరంగం చేసుకుని నీటిని తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజం కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా తీసుకపోలే… మంత్రి ఉత్తమ్..
సూర్యాపేట జిల్లా….
హుజూర్ నగర్ నియోజకవర్గం లో చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సి ఎం ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ…..
రైతులకి విజ్ఞప్తి చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఏలినో ప్రభావంతో కరువు ప్రారంభమైంది…
వచ్చే వేసవికి నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ ఒక్కసారి వరి వేయడం ఆపేసి ఆరు తడుల పంటలని వేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఎండాకాలంలో మంచి నీటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు..
బిఆర్ఎస్ పార్టీ వాళ్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కొంత ఓర్వలేక నాగార్జునసాగర్ పై రాజకీయ రగడ చేస్తుంది….
ఆంధ్రా వాళ్ళు సొరంగం చేసుకుని నీటిని తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజం కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా తీసుకపోలే కుడి కాలువ ఎడమ కాలువ కలిపి 264 టీ యం సి ల నీళ్ళు ఉపయోగం నాగార్జున సాగర్ లో ఉంటాయి మొత్తం నాగార్జున సాగర్ లో ఇప్పడు ఉపయోగపడే నీళ్ళు 324 టీ యం సి లు అందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాళ్ల సైడ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు 324 టీ యం సి లో 1.8 టీ యం సి లు మంచి నీళ్ళకు తీసుకపో వటానికి ప్లాన్ చేసుకుంటున్నారు దాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు కి అబ్జెక్షన్ పెట్టినం తరలించకపోతున్నారంటూ
ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని అన్నారు…. నీటిని కూడా విడుదల చేసే ప్రసక్తే లేదంటు తెలిపారు…..
కృష్ణ గోదావరి జలాల విషయంలో ఎవరో పనికిరాని వారు రాద్ధాంతం చేస్తే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని BRS పార్టీ కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు..
బీఆర్ఎస్ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం చేతకాక పిచ్చిపిచ్చి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎలినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడుతూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లబ్ధిదారులకు పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు….హుజూర్ నగర్ నియోజకవర్గానికి తాను ఏడుసార్లు ప్రాతినిధ్యం ఒకే పార్టీ నుండి వహిస్తూ వస్తున్నారని అన్నారు… తాను ఆర్మీలో పనిచేశానని నీతి నిబద్ధతతో ప్రజలందరికీ మంచి పాలన అందిస్తున్నానని తెలిపారు..