ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయితీలను ప్రజలకు చేరకుండా కార్పొరేట్లు తమ జేబుల్లోకి… ప్రధాని మోదీ…!

ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయితీలను ప్రజలకు చేరకుండా కార్పొరేట్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఉద్యోగాలను సృష్టించట్లేదని, వేతనాలు పెంచట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు…న్యూఢిల్లీలో నేడు జరిగిన ఫిక్కీ సమావేశంలో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్నును ప్రభుత్వం 2019 నాటికి 22 శాతానికి తగ్గించిందని ప్రధాని గుర్తు చేశారు. అంతేకాకుండా, రూ.12 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేకుండా చేశామని అన్నారు. కానీ ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా కార్పొరేట్లు తమ వంతు చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కూడా ఇలాగే కొనసాగుతుందా? అని నిలదీశారు.

వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని తెలిపారు. కానీ కార్పొరేట్ వర్గాల నుంచి మాత్రం ప్రశంసలు రాలేదని చెప్పారు. ‘మీరు మెచ్చుకోరన్న విషయం నాకు బాగా తెలుసు. మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. మీ ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త ఉద్యోగాలు కల్పించారా? లేదు! మోదీజీ.. మీరు చేసేది చేయండి మేము మాత్రం అలా చూస్తూ ఉంటాము అన్నట్టు మీ తీరు ఉంటుంది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు..భారత‌దేశం ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేదని ప్ర‌ధాని మోదీ అన్నారు. గ‌త ప‌న్నెండేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. భారతదేశ‌ పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తున్న‌ద‌ని అన్నారు. పాత ప్ర‌భుత్వాల‌ విధానాలు భారతదేశ‌ వృద్ధిని అణచివేశాయని ప్ర‌ధాని ఆరోపించారు. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయని అన్నారు. గత విధానపరమైన వైఫల్యాలు దేశం వృద్ధిని నిరోధించాయ‌ని చెప్పారు.

కార్పొరేట్‌ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. గడిచిన‌ 13 ఏళ్లలో భారత్‌లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని చెప్పారు. ఈ విష‌యం తాను చెబుతున్న‌ది కాద‌ని, ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొన‌ద‌ని ఆయ‌న తెలిపారు. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామ‌న్నారు. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించామ‌ని చెప్పారు…