మా దాంట్లో కొందరికి ఎర్రికుక్క కరిచింది.. సీఎం రేవంత్ రెడ్డి..


మా దాంట్లో కొందరికి ఎర్రికుక్క కరిచింది

వాళ్లను కార్యకర్తలు ‘ఎర్రగడ్డ’కు పంపుతారు

సొంత పార్టీ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

చర్యలు తప్పవని ఇండైరెక్ట్‌గా సంకేతాలు!..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సిద్దిపేట బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల బహిరంగ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ “మా దాంట్లో కొందరికి ఎర్రికుక్క కరిచింది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సీఎం పరోక్షంగా ఈ కౌంటర్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
https://x.com/i/status/2123459893827088687
సిద్దిపేటలో ఇక ఆటలు సాగవు

సిద్దిపేట ఎవరి కోట కాదని ఆ కోటలు బీటలు పారే సమయం వచ్చిందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రసంగించారు. సిరిసిల్లలో మొదలైన జైత్రయాత్ర సిద్దిపేటకు వచ్చిందన్న ఆయన సిద్దిపేటలో ఇకపై ఒక్క కుటుంబ ఆధిపత్యం నడవదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తున్నామని అన్నారు. పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేశామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు…