Dharmapuri Congress MLA Govt. Whip Adluri Laxman Kumar’s behavior is saddened by the Congress cadre..
ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు పై కాంగ్రెస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట ఉండి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను లెక్కచేయడం లేదు అవేదన వ్యక్తం చేశారు.సెల్ఫీ వీడియో ద్వారా వెల్గటూర్ మండలం వెంకటపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోటయ్య…ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే లక్ష్మణ్ కుమార్ పూర్తిగా మారిపోయాడని ఫైర్ అయ్యారు. దర్మపురి నియోజకవర్గంలో రెడ్డి వర్గమే నడుస్తుంది.. రెడ్డిలు చెప్తేనే పని అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. .సామాన్య, మధ్యతరగతి వాళ్ళను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పట్టించుకోవడం లేదు.. కనీసం ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వడం లేదని చెప్పారు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తీవ్ర అవమానం జరుగుతుంది.. ఎవరు బైటకి చెప్పుకోలేక లోలోపల బాధపడుతున్నారన్నారు..