దావోస్‌ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది… దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై తెలంగాణ సామర్థ్యాన్ని వివరించి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల టీమ్ దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. అంతేకాకుండా తెలంగాణ భవిష్యత్తును ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ప్రస్తుతం జ్యూరిచ్‌లో పర్యటిస్తున్నారు నటుడు చిరంజీవి. కుటుంబసభ్యులంతా అక్కడికి వచ్చారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలియడంతో ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానంతో దావోస్ సదస్సుకు హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్- 2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ అభివృద్ధిపై తన మద్దతు ప్రకటించారు..