జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026..
అభివృద్ధికి సాంకేతికత ఒక ప్రేరక శక్తి..
దేవరకొండ………
డిజిటల్ అవగాహన, పారిశ్రామికోత్పత్తి అభివృద్ధి, ఆవిష్కరణలు, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించమే జనజాతీయ గరిమా ఉత్సవ్ – 2026 ప్రధాన ఉద్దేశమని సాంకేతిక సెషన్ను క్లావెరిట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మణికంఠ స్వామి యాతం , బంజారా మాక్స్ సొసైటీ డైరెక్టర్ లావుడి భాష తెలిపారు. శుక్రవారం గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఆధ్వర్యంలో, గిరిజన సంక్షేమ శాఖ ,రాష్ట్ర నోడల్ విభాగం సహకారంతో దేవరకొండ మండల పరిధిలోని పెంచికల్పాడు మోడల్ స్కూల్ వద్ద ఏ ఐ & డిజిటల్ అవగాహన, గిరిజన పారిశ్రామికోత్పత్తి, ఉత్పత్తుల బ్రాండింగ్ వీడీవీకే అనుసంధానం అంశాలపై ప్రత్యేక శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 35 మంది గిరిజన కళాకారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బంజారా హస్తకళలు, గిరిజన ఆభరణాలు, ఎంబ్రాయిడరీ కళాఖండాలు,ఇతర సంప్రదాయ గిరిజన కళారూపాలను ప్రదర్శించారు.
ఈ ఉత్పత్తులు గిరిజన సమాజాల గొప్ప సాంస్కృతిక వారసత్వానికి,సంప్రదాయ నైపుణ్యాలను ప్రతిబింబించాయి.ఎం. అరుణ ఎస్. జ్యోతి, గిరిజన కళాకారులను సమీకరించి కార్యక్రమంలో పాల్గొనడానికి తోడ్పాటు అందించారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సాధనాలు కాన్వా వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించి ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ మరియు గిరిజన ఉత్పత్తుల ప్రోత్సాహంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతికత ద్వారా గిరిజన కళాకారులు తమ ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని పెంచుకొని స్థిరమైన ఉపాధి అవకాశాలను ఎలా సాధించగలరో వివరించారు.
ఈ కార్యక్రమంలో డిజిటల్ సాక్షరత, సోషల్ మీడియా ప్రచారం, ఈ-కామర్స్ అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తి అభివృద్ధి వన్ ధన్ వ్యవస్థలో గిరిజన పారిశ్రామికోత్పత్తి బలోపేతంపై అవగాహన కల్పించబడింది. ఉత్పత్తుల లేబుల్స్, ప్రచార పదార్థాలు మరియు ప్యాకేజింగ్ రూపకల్పన కోసం సులభమైన డిజిటల్ సాధనాలపై ప్రాక్టికల్ ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమం వికసిత భారత్ @2047 దిశగా గిరిజన కళాకారులను శక్తివంతం చేయాలనే గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థ సంకల్పం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్. జి. చలవాడి, ఉప మేనేజర్, కె. రాంబాబు, అసిస్టెంట్ మేనేజర్ వెంకట సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.