దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి సస్పెండ్‌ చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి — విద్యార్థి సంఘాల డిమాండ్‌..

దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి
సస్పెండ్‌ చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి — విద్యార్థి సంఘాల డిమాండ్‌..

దేవరకొండ ……..
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.మంగళవారం BRSV, ABVP, SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ భాస్కర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భాస్కర్‌పై సంబంధిత పోలీస్‌ కేసు నమోదు చేసి, విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.కళాశాలలో విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని, ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ,ABVP నాయకులు గోపీచంద్,SFI డివిజన్ అధ్యక్షులు బుడిగ వెంకటేష్,ముదిగొండ హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.