దేవరకొండ ఫోటో, వీడియో గ్రాఫర్ల సంఘంలో సందీప్ ప్యానల్ విజయం ..-
26 ఓట్ల మెజార్టీతో చరిత్రాత్మక విజయం…
దేవరకొండ ………
దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం అత్యంత ఉత్కంఠభరితంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. ఫోటోగ్రాఫర్ల ఐక్యతకు నిదర్శనంగా భారీ పోలింగ్ నమోదైంది.
భారీ పోలింగ్ హోరాహోరీ మధ్య పోరు
సంఘంలో మొత్తం 191 మంది సభ్యులు ఉండగా, 168 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అధ్యక్ష పదవి కోసం కలారి సందీప్ కుమార్ మరియు బద్దల గణేష్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది.
ఫలితాల్లో కలారి సందీప్ కుమార్ 97 ఓట్లు సాధించి 26ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి బద్దల గణేష్ కు 71 ఓట్లు వచ్చాయి. 26 ఓట్ల మెజార్టీతో సందీప్ ప్యానల్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. సందీప్ ప్యానల్ నుండి గోపాల్ నాయక్, మంజునాథ్ లు కూడా ఘన విజయం సాధించారు.
పకడ్బందీగా ఎన్నికల కమిటీ నిర్వహణ నిర్వహించినారు
ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ గా జయరామ్ సమడం, సంజీవ్ నీలా, రాము రామావత్, శివ, వెంకట్ రెడ్డి వ్యవహరించారు. వారి పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు దిగ్విజయంగా పూర్తయ్యాయి.
విజయం తర్వాత సందీప్ భావోద్వేగం – కీలక హామీ
ఎన్నికల ఫలితాల అనంతరం నూతన కార్యవర్గానికి సంఘ సభ్యులు, సీనియర్లు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అనంతరం నూతన అధ్యక్షుడు కలారి సందీప్ కుమార్ మాట్లాడుతూ….. నాకు అండగా నిలిచి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు
నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న ఐదుగురిని ఈ జన్మలో మర్చిపోలేను. వారికి తోడు మరో ఐదుగురు కలిసి నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వారి రుణం తీర్చుకోలేనిది.
ఇది నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం. అసోసియేషన్ లోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని, అందరి అభిప్రాయాలకు విలువ ఇచ్చి ముందుకు సాగుతా. సంఘ భవన నిర్మాణాన్ని రాబోయే రెండు సంవత్సరాలలో పూర్తి చేసి తీరుతా అని వాగ్దానం చేస్తున్నా అంటూ హామీ ఇవ్వడంతో సభ్యులంతా హర్షధ్వానాలతో స్వాగతించారు…
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఈసీ సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.