పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలని, దర్పాన్ని ప్రదర్శించడం మానేసి విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ముఖ్యంగా భూవివాదాలు, సివిల్ స్వభావం గల వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, ఇలాంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్టేషన్లలో విజిటింగ్ అవర్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని, అధికారులు తమ క్యాంప్ ఆఫీస్ విధానాన్ని వీడి కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.పోలీసు అధికారులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. ఈగల్ విభాగం ద్వారా ఇప్పటివరకు 825 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించామని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవల స్పందనను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే 112 సర్వీసులను డ్రోన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లపై నిరంతరం నిఘా ఉంచాలని, తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.