అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ విజయం
మ్యాజిక్ ఫిగర్ సాధించిన డొనాల్డ్ ట్రంప్
277 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్
226 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన కమలా హారిస్
సెనెట్, పాపులర్ ఓట్లలోనూ ట్రంప్‌దే పైచేయి…
హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డొనల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు..ఇది అమెరికన్లు గర్వించే విజయమని చెప్పారు. తమ దేశం కోలుకునేందుకు తన విజయం దోహదపడుతుందని చెప్పారు. అమెరికన్ల కోసం తాను ప్రతిరోజు పోరాడుతూనే ఉంటానని ట్రంప్ చెప్పారు. అమెరికా గోల్డెన్ ఏజ్‌ను చూడబోతుందని అన్నారు…
ఓ అధ్యక్షుడు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయి… ఆ తర్వాత శ్వేతసౌధాన్ని తిరిగి గెలుచుకోవడం ఇది రెండోసారి. 131 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డ్‌ను సృష్టించాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన వారు ఉన్నారు. కానీ ఓసారి పదవిని చేపట్టాక… రెండోసారి ఓడిపోయి… మూడో ఎన్నికల్లో గెలవడం రెండోసారి.
2020లో జోబైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌పై ఘన విజయం సాధించారు. ట్రంప్ మొదటిసారి హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు.
డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మాత్రమే ఇలా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 1884లో గెలిచిన ఆయన 1888లో ఓటమి చెందారు. ఆ తర్వాత 1892 ఎన్నికల్లో గెలుపొందారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ట్రంప్ ఆ రికార్డ్ సృష్టించారు..