సొంత బడి రుణం తీర్చుకున్న లయన్ క్లబ్ మెంబెర్స్ (పూర్వ విద్యార్థులు) – సొంత పాఠశాలకే 380 మందికి పుస్తకాల వితరణ..
చదువుకున్న పాఠశాలకే చేయూత.. పూర్వ విద్యార్థుల సేవకు హర్షం..
దేవరకొండ………….
దేవరకొండ లో తాము చదువుకున్న ప్రభుత్వ బడి రుణం తీర్చుకోవాలనే గొప్ప ఆలోచనతో దేవరకొండ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం హయత్ నగర్ లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్న ఆ పూర్వ విద్యార్థులే తమ సొంత పాఠశాలలో చదువుతున్న 380 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ను ఉచితంగా పంపిణీ చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీజీ MJF. గర్లపాటి జితేందర్ హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.
ఇదే బడిలో చదివి.. ఇదే బడికి సాయం చేయడం సంతోషం
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ పిల్లలకు ఇబ్బంది ఉన్నా అక్కడ మా లయన్స్ క్లబ్ సభ్యుడు ఉంటాడు. మేము కూడా ఈ దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాము. ఒకప్పుడు ఇదే బెంచీలపై కూర్చున్న మేము, ఈ రోజు అదే పాఠశాల పిల్లలకు సాయం చేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మీరు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లి మరికొందరికి సహాయం చేయాలి అని పిల్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హయత్ నగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ Ln. ఉప్పల శ్రీధర్, సెక్రటరీ Ln. మురళి, ట్రెజరర్ Ln. భార్గవరాజు, పుస్తకాల దాత Ln. కుంచకురి యాదయ్య, అన్నదానం మరియు పుస్తకాల కమిటీ చైర్మన్ Ln. వనపర్తి రమేష్, దేవరకొండ లైన్స్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి జంగయ్య, కార్యదర్శి కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి కాశీనాథ్ దేవరకొండ షిరిడి సాయిబాబా ఆలయం అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్, కుంచకూరి రామశర్మ, కుంచకూరి అశోక్, కుంచకూరి శ్రీనివాస్, బండారు కొండయ్య, బెజవాడ సత్యం,
పాఠశాల హెడ్మాస్టర్ కొలనుపాక శ్రీపతిరావు, ఉపాధ్యాయులు కర్నాటి పండరినాథ్, Md. అబిద్ అలీ, K. సంతోష్ రెడ్డి, K. లోక్య, హేమ్లా మరియు మిగతా ఉపాధ్యాయులు పాల్గొని పూర్వ విద్యార్థుల సేవలను అభినందించారు.