ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్!..ఈ-సైకిళ్లపై రూ.11,000 వరకు భారీ రాయితీ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పథకం కింద ఈ-సైకిళ్లపై రూ.11,000 వరకు భారీ రాయితీ ప్రకటించింది. రూ.35,000 ధర గల అత్యాధునిక ఎలక్ట్రిక్ సైకిళ్లు కేవలం రూ.24,000కే అందుబాటులోకి వస్తాయి. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. పర్యావరణ సంరక్షణ, పెట్రోల్ ఖర్చు తగ్గించడం, మహిళా సాధికారతతో పాటు యువతకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం…స్కీమ్‌తో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతే సాధారణ సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. డిజిటల్ మీటర్‌లో స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, దూరం అన్నీ సులభంగా తెలుస్తాయి. బ్యాటరీని తీసి ఇంట్లోనే 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.