మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి నిలకడగా ఆడుతుంది..25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 39, యశస్వి జైస్వాల్ 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు…
ఈ సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రాహుల్, జైస్వాల్ నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
క్రిస్ వోక్స్ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి జైస్వాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వోక్స్ సంధించిన బంతి ఏమంత వేగవంతమైంది కాదు. జైస్వాల్ డిఫెన్స్ ఆడినా బ్యాట్ హ్యాండిల్ దగ్గర చీలిపోయింది. దీంతో అతను బ్యాట్‌ను మార్చకతప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఒత్తిడిలో జైస్వాల్
యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించినప్పటికీ చెత్త షాట్ సెలెక్షన్ కారణంగా ఒత్తిడిలో ఉన్నాడు. మూడో టెస్ట్‌లో అతను ఓ చెత్త ఆడి వికెట్ పారేసుకోవడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ మ్యాచ్‌లో భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా.. జైస్వాల్ అవసరం లేని షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంతో పాటు జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.
జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆ మ్యాచ్‌లో టీమిండియా కొంపముంచింది. జైస్వాల్ తన సహజ ఆటతీరుతో ఆడి ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండేది. ఈ చెత్త షాట్ కారణంగా జైస్వాల్ మేనేజ్మెంట్తో పాటు అభిమానుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో అతను తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ సహా 241 పరుగులు చేశాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది..
ఒకే మ్యాచ్‌లో ఐదుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నేడు ఇంగ్లాండ్‌తో జరగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లతో బరిలోకి దిగారు..ఇలా ఐదుగురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఒకే మ్యాచ్‌లో ఆడడం టీమ్ఇండియా చరిత్రలో ఇదే తొలిసారి. ఆ ఐదుగురిలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ నిండిపోయింది. వీరిలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్లు కావడం విశేషం. టీమ్‌లో ఇలాంటి మార్పులు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగాత్మంగా చేసిన జట్టు కూర్పు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
సాధారణంగా టెస్టు క్రికెట్లో కుడిచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం. అయితే గత కొన్నేళ్లుగా ఎడమచేతి వాటం ఉన్న బ్యాట్స్మెన్లు తమదైన స్టైల్‌తో ఆటను నిలబెడుతున్నారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు సాధారణం కంటే భిన్నంగా శైలీ ఉండడం సహా బౌలర్లను ఇబ్బంది కలిగించే నైపుణ్యం వారిలో ఉంటుంది. దీంతో ప్రత్యర్థి ఫీల్డింగ్ సెట్టింగ్ పై కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆ బ్యాటర్లదే పైచేయి అవుతుంది. ఇదే అదునుగా భావించిన టీమ్ఇండియా ఇలాంటి పరిస్థితిలో ఈ టీమ్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నాలుగో టెస్టులో ఆడుతున్న భారత జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
యశస్వి జైస్వాల్: ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో తన సత్తా చాటిన ఈ యువ ఓపెనర్, దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే సత్తా ఉంది.
రిషబ్ పంత్: గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన పంత్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చగలడు. అతని కీపింగ్ కూడా మ్యాచ్‌లో కీలకంగా మారనుంది.
సాయి సుదర్శన్: దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సుదర్శన్.. తన క్లాసిక్ బ్యాటింగ్‌తో జట్టుకు బలం చేకూరుస్తాడు.
వాషింగ్టన్ సుందర్: బౌలింగ్‌తో పాటు కీలక సందర్భాల్లో బ్యాట్‌తో రాణించగలడు వాషింగ్టన్ సుందర్.
రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో బ్యాట్, బంతి, ఫీల్డింగ్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు పెద్ద బలంగా మారిన జడేజా, లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు చేయగలడు.
ఈ ఐదుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు నిలదొక్కుకుంటే మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ కనుగొనడం కష్టమవుతుంది. ఈ క్రమంలో పరుగుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
India Vs England.