భారతీయుడినని అనిపించేలా ఇంటి పేరును సింగ్‌గా మార్చుకుని జాబ్ కోసం ఫేక్ దరఖాస్తులు పంపిస్తే స్పందన వచ్చింది…
తాను ఒక భారతీయుడినని అనిపించేలా ఇంటి పేరును సింగ్‌గా మార్చుకుని జాబ్ కోసం ఫేక్ దరఖాస్తులు పంపిస్తే స్పందన వచ్చిందన్న ఒక శ్వేతజాతీయుడి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాల్ స్ట్రీట్ ఏప్స్ అనే అకౌంట్లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది…నేను దాదాపు 300 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. ఫోన్ లేదా ఈమెయిల్ పంపించలేదు. దీంతో, ఒక నకిలీ రెజ్యూమే పంపిద్దామని అనుకున్నా. అందులో నా ఇంటి పేరును సింగ్‌గా మార్చుకున్నా. ఈమెయిల్ అడ్రస్‌ను కూడా మార్చాను. నా ఉద్యోగార్హతలనూ మార్చాను’ అని చెప్పుకొచ్చారు. ఈ ఫేక్ రెజ్యూమే పంపించాక తనకు మూడు సంస్థల నుంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు…ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. శ్వేతజాతీయుడి మాటల్లో పస లేదని చెప్పారు. ‘ఆయన శ్వేతజాతీయుడైనంత మాత్రాన మూడు వందల కంపెనీలు తిరస్కరించాయంటే నమ్మశక్యంగా లేదు.. దీని వెనకాల ఏఐ తప్పిదం ఏదైనా ఉండవచ్చు’ అని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘ఫేక్ రెజ్యూమేలో ఉద్యోగార్హతలను కూడా మార్చినట్టు ఆయనే చెబుతున్నారు. అలాంటప్పుడు కేవలం భారతీయ ఇంటిపేరు వలనే కంపెనీలు స్పందించాయని చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది?’ అని మరో వ్యక్తి ప్రశ్నించారు..