గచ్చిబౌలిలో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
SLN టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్లోని 12వ అంతస్తులో ఉన్న 1218 నంబర్ గదిలో మృతదేహం లభ్యం
మృతుడు కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41)గా గుర్తింపు
వ్యాపార నిమిత్తం నవంబర్ 2వ తేదీన తన పార్టనర్ డేవిడ్ వూతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి హోటల్లో ఉంటున్న మిచెల్
నవంబర్ 4 సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఈరోజు గది తలుపులు తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో మిచెల్ ఉన్నట్టు గుర్తింపు
హోటల్ సిబ్బంది 108కు కాల్ చేయగా, పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన 108 సిబ్బంది..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఎస్ఎల్ఎన్ టెర్మినస్ భవనంలోని 12వ అంతస్తు, గది నంబర్ 1218లో ఆయన మృతదేహం లభ్యమైంది. ..పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41)గా గుర్తించారు. వ్యాపార పనుల నిమిత్తం తన భాగస్వామి డేవిడ్ వూతో కలిసి నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చారు.
అయితే నవంబర్ 4వ తేదీ సాయంత్రం నుంచి బ్రియాన్ లీ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఆయన గది వద్దకు వెళ్లారు.తలుపు తెరిచి చూడగా బ్రియాన్ లీ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా, వారు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. మిచెల్ మృతికి సంబంధించి అమెరికన్ ఎంబసీకి మరియు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు..