గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్…ఈవెంటులో కనిపించిన సందడి..!!

గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ థియేటర్ దగ్గర పోలీసుల ఆంక్షలు..

AMB సినిమాస్ దగ్గర పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు

సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినిమా ఈవెంట్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్

ఫ్లెక్సీలు, హోర్డింగులు ఎలాంటి హడావుడి కేవలం టికెట్ ఉన్న వారికే అనుమతి..


జనవరి 10వ తేదీన రానున్న ‘గేమ్ ఛేంజర్’
ట్రైలర్ లాంచ్ ఈవెంటులో కనిపించిన సందడి
శంకర్ దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉందన్న చరణ్
చరణ్ యాక్టింగ్ అద్భుతమన్న శంకర్

‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. శ్రీకాంత్ గారు, ఎస్ జే సూర్య గారు, సముద్రఖని గారు, అంజలి గారు, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు గారు, శిరీశ్ గారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు” అని అన్నారు..

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తెలంగాణలో సినిమా ఈవెంట్స్‌పై ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో, రామ్‌ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్‌చేంజర్ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ AMB సినిమాస్‌లో మంగళవారం జరిగింది. కానీ, గత ఈవెంట్స్‌తో పోలిస్తే, ఈసారి సీన్ పూర్తిగా వేరుగా కనిపించింది. ఫ్లెక్సీలు, హోర్డింగులు లేకుండా ఈవెంట్‌ నిర్వహించబడింది.

AMB సినిమాస్‌ ఎంట్రీ దగ్గర పోలీసులు, బౌన్సర్లు అలర్ట్‌గా నిలిచి, కేవలం టికెట్‌ ఉన్న వారికే ప్రవేశం కల్పించారు. ఇది మాత్రం సందర్శకుల మధ్య చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న భారీ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ అయినప్పటికీ, ఈసారి అభిమానుల హడావుడి లేకుండా పూర్తిగా నియంత్రణలో ఈవెంట్ జరిగింది. థియేటర్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..

#GameChanagerTrailer….