గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసిన హోటల్ యజమాని..

గోవాకు వెళ్ళే జంటలు జాగ్రత్త!

గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసిన హోటల్ యజమాని

మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్నా వినకుండా బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్ – ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లగా, వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్(40) అనే వ్యక్తి

ఇటీవల మహిళకు ఫోన్ చేసి, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన యశ్వంత్

తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకున్నా యశ్వంత్ వినకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సనత్‌నగర్ పోలీసులు.