gold price today:-తగ్గిన బంగారం ధరలు..

హైదరాబాద్ మరియు తెలంగాణలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,25,560 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,15,100 వద్ద ట్రేడ్ అవుతోంది..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,560గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,15,090గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది.

ఆభరణాల తుది ధరలలో తయారీ ఛార్జీలు మరియు వర్తించే పన్నులు కూడా చేర్చబడి ఉండవచ్చు. అందువల్ల, కొనుగోలు ధర జాబితాలో ఉన్న బంగారం ధర కంటే భిన్నంగా ఉండవచ్చు.