టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు…

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌(136) భారీ సెంచరీతో కదం తొక్కగా…

యశస్వి జైశ్వాల్‌(85), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(80), శుబ్‌మన్‌ గిల్‌(98), రిషబ్‌ పంత్‌(55 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఈ క్రమంలో భారత్ తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని అరుదైన రికార్డును నెలకొల్పింది. విదేశీ గడ్డపై జరిగిన టెస్టు ఇన్నింగ్స్‌లో భారత్‌కు చెందిన టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఐదుగురూ అర్ధశతకాలు సాధించడం గత 94 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా బ్యాటర్లు ఇలాంటి ఘనతను సాధించడం ఇది ఐదవసారి కాగా.. గత నాలుగు సందర్భాల్లోనూ ఈ మ్యాచ్‌లు భారత్ గడ్డపైనే జరిగాయి.

ఈ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్‌(175), గ్లెన్ ఫిలిప్స్‌(118) సెంచరీలతో సత్తాచాటారు.

టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర…

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేనా) దేశాల్లో ఒకే టెస్ట్ ఇన్నింగ్స్లో భారత టాప్ 5 బ్యాటర్లు అందరూ యాభైకి పైగా పరుగులు చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85), కేఎల్ రాహుల్ (136), మూడో నంబర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (80), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (98), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (55 పరుగులు) ఈ అద్భుత ఘనతను సాధించారు. ఇక మొత్తం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇండియా టాప్ ఫోర్ బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో అర్ధశతకాలు దాటడం ఇది 12వ సారి కాగా, ఆసియా ఖండం వెలుపల కేవలం రెండోసారి మాత్రమే. గతంలో 2006లో వెస్టిండీస్లోని బస్సెటెర్రే టెస్టులో భారత టాపార్డర్ ఈ మైలురాయిని అందుకుంది…