హాస్టల్లో ఉంటున్న విద్యార్థులపై పైచాచికింగా దాడి చేసిన హాస్టల్ వాచమెన్..!

సమాజం సిగ్గుపడేలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది… చిన్నపిల్లలకి అభం శుభం తెలియదు అని కూడా తెలియని ఓ మూర్ఖపుడు చేసిన బాగోతానికి, ఇద్దరు పిల్లల ప్రాణం మీదికి తెచ్చింది.. చిన్న వయసులో తెలిసి తెలవని వయసులో అల్లారుముద్దుగా గొడవ చేస్తూనే ఉంటారు వాటిని భరిస్తూ ఏదో విధంగా పిల్లలకి జ్ఞానాన్ని చెప్పాల్సిన వ్యక్తి ఇలా తయారైతే పరిస్థితి ఏమిటో మరి..!?

గుంటూరు జిల్లా:- ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలోని sc బాలుర హాస్టల్లో ఉంటూ ZP పాఠశాల లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల ను ZP పాఠశాల ఆవరణలో పైచాచికంగా కొట్టటం తో ఒకరికి తలకు తీవ్ర రక్త గాయాలు ఒకరికి నడం పై కనపడని గాయాలు అయ్యాయి స్థానికులు పక్కనే ఉన్న కారు డ్రైవర్ లు వారి ఇద్దరినీ పోలీస్ స్టేషన్లో కు సమాచారం ఇచ్చి అక్కడ నుండి పెదనందిపాడు PHC కు తరలించారు పెదనందిపాడు SI అద్దంకి మధు పవన్ హాస్పటల్లో ఇద్దరు పిల్లల్ని ని విచారించి గుంటూరు GGH కు తరలించాలి అని సూచించిచారు. వాచ్ మేన్ పై లిఖిత పూర్వకంగా పిర్యాదు ఇవ్వాలి అన్నారు….పెదనందిపాడు ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించారు విద్యార్థులకు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు..