చిన్న వయసులోనే బట్టతల రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అలాంటి వాటిలో పని ఒత్తిడి, సరైన స్థాయిలో పోషకాలు అందకపోవడం నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడానికి కారణం అవుతుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
ఉల్లిపాయ: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన తలలో రక్తప్రసరణను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. దీనికోసం ఉల్లిపాయలు మెత్తగా మిశ్రమంలా తయారు చేసి అందులో నుంచి రసం బయటకు తీయాలి ఆ రసంలోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి తలకు బాగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా జుట్టుకు పోషకాలు అంది ఒత్తుగా పెరగడానికి కారణం అవుతుంది.
ఆముదం: స్వచ్ఛమైన గానుగలో తీసిన ఆముదపు నూనె బట్టతల సమస్య నుంచి బయటపడటానికి కారణం అవుతుంది. ఇలా ఆముదపు నూనెను వేలితో సహాయంతో తలమాడుకు మొత్తం బాగా అంటే విధంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బేబీ హెయిర్ వచ్చి బట్టతల సమస్య నుంచి మనల్ని బయటపడేలా చేస్తుంది.
కలబంద: కలబందలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి ఇది సహజంగా చర్మ జుట్టు సౌందర్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది అందుకే వారంలో రెండు మూడు సార్లు కలబంద జెల్ మన తలకు పట్టించి బాగా మసాజ్ చేసిన తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారంలో రెండు మూడు సార్లు కనుక చేస్తే జుట్టు ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒత్తయిన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..
లవంగం నూనె..
ఆయుర్వేదంలో లవంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లవంగాల్ని అనేక ఆరోగ్య సమస్యల్ని నయం చేయడానికి ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తున్నారు. ఇక జుట్టు ఆరోగ్యం కోసం లవంగాల్ని ఎన్నో యేళ్లుగా వాడుతున్నారు. లవంగాలతో తయారు చేసిన నూనె వల్ల జుట్టు బలంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోవడం సమస్యలు తగ్గి.. మెరుస్తుంది. జుట్టుకు కావాల్సిన పోషణ అందించడమే కాకుండా షైన్ కూడా అందిస్తుంది. లవంగాల నూనె వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు, అది ఎలా వాడాలో ఓ లుక్కేద్దాం.
జుట్టు మూలాలు బలపడతాయి..
లవంగాల నూనె పోషక గుణాలతో నిండి ఉంటుంది. ఇది బలహీనమైన జుట్టుకు చెక్ పెడుతుంది. ఈ నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు బలాన్ని పెంచుతాయి. జుట్టుకు తగిన పోషణనిచ్చి.. బలంగా మారుస్తుంది. లవంగం నూనె తేమను ఉత్పత్తి చేస్తుంది. దీంతో జుట్టు పెళుసు బడటం, పొడి బారడం జరగదు. దీంతో.. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. రెగ్యులర్ వాడకంతో, జుట్టు బలంగా మారడంతో పాటు అస్సలు రాలిపోదు..
తెల్ల జుట్టుకు చెక్..
ఈ రోజుల్లో ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తెల్ల జుట్టుకు సహజ పరిష్కారాన్ని అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు హెయిర్ షాఫ్ట్, ఫోలికల్స్ ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. సహజ రంగును మెరుగుపరుస్తుంది.
ఎలా ఉపయోగించాలి..
మీరు లవంగం నూనెను నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు. దీన్ని రాత్రిపూట జుట్టుకు పట్టించి, మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. దీన్ని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడువుగా మారుతుంది. జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది. కావాలంటే గోరు వెచ్చగా లవంగాల నూనెను తలకు అప్లై చేసుకోవచ్చు.
నోట్…వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.