మంచిరేవుల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌.. హరీష్ రావు..

మంచిరేవుల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌.. హరీష్ రావు

మేము కాపాడిన మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమిలో 10 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టింది

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10 ఎకరాల 10 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారు

మహమ్మద్ అమీర్ సలావుద్దీన్ అనే వ్యక్తి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ అధినేత సంతోష్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు

ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలియకుండా పోలీస్ శాఖకు చెందిన 10 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు?..– హరీష్ రావు...

100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్‌మెంట్‌పై ఆందోళన చెందుతున్న నార్సింగి ప్రజలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్‌ నేత ప‌ట్లోళ్ల కార్తీక్ రెడ్డి క‌లిసి బాధితులు స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

మంచిరేవుల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌ను బయటపెట్టిన హరీష్ రావు

మేము కాపాడిన మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమిలో 10 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టింది

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10 ఎకరాల 10 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారు

మహమ్మద్ అమీర్ సలావుద్దీన్ అనే వ్యక్తి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ అధినేత సంతోష్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు

ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలియకుండా పోలీస్ శాఖకు చెందిన 10 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అని అన్నారు..మియాపూర్ భూముల గురించి రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 95 సార్లు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రతిసారీ వైద్యనాథ్ గారు బలంగా వాదించారు

జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించడం వల్లే ఈరోజు మియాపూర్ భూములు ప్రభుత్వానికి దక్కాయి

అసలు మియాపూర్ భూముల గురించి తెలుసుకుని సీఐడీ విచారణకు ఆదేశించి, అధికారులను సస్పెండ్ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం

ఆ భూముల విషయంలో డా. ప్రసాద్ అన్న పార్థసారథి, పీవీఎస్ శర్మ, శ్రీనివాస్ రావు అనే ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వం

డా. ప్రసాద్‌తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నాడు

అసలు డా. ప్రసాద్‌కు చెందిన ట్రినిటీ సంస్థ భూములను సుప్రీంకోర్టులో కూడా పోరాడి, అవి ప్రభుత్వానికి చెందిన భూములని తీర్పు వచ్చేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం

మొన్న మియాపూర్ భూముల గురించి ఇచ్చిన తీర్పు కూడా మేము తెచ్చిన డా. ప్రసాద్ భూముల ఆధారంగానే ఇస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అన్ని అన్నారు..