భారీ వర్షానికి వరి పంటకి తీవ్ర నష్టం..!

*సూర్యాపేట జిల్లా..*

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి

సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి , ముఖ్యంగా కోతల దశలో ఉన్న వరి పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షానికి తడిసిన వరి పంట నీట మునిగి నేలవాలింది , రెండు మూడు రోజుల్లో పంట కోత కొయ్యాలని భావించిన అన్నదాతలకు అపార నష్టం జరిగింది . ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు లేక భూగర్భ జలాలు లేక తీవ్రమైన నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొని అరకొరగా పంటలను కాపాడుకుంటూ వచ్చామని , ఆర్నబ్ తూఫాన్ , తాజా వర్షాల కారణంతో ఉన్న ఆకాస్త పంటలు నీటిపాలై తాము ఘోరంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 70 శాతం నీళ్ళు లేక పంటలు ఎండగా.. ఎంతో ఆశ పెట్టుకున్న మిగిలిన పంట అకాల వర్షంతో నీళ్ళ పాలైందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు . కరువు , అకాల వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..