*ఆస్తమా తగ్గించే 5 శక్తివంతమైన ఆయుర్వేద ఇంటి చిట్కాలు*
1.పసుపులో కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకుగాను రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగాలి. దీంతో ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
2.ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్లలా పనిచేస్తాయి. అందువల్ల ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. నారింజ, నిమ్మ, కివీ, బంగాళాదుంపలు, పాలు, చేపలు, గుడ్లు, లివర్, జున్ను, తృణ ధాన్యాలు, సిట్రస్ ఆహారాలను తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.
3.కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, గ్రీన్ వంటి పానీయాలను తీసుకోవడం వల్ల శ్వాస కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వాయు మార్గాల పనితీరు మెరుగు పడుతుంది. అయితే కెఫీన్ ను అధిక మోతాదులో తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావాలను కలగజేస్తుంది. కనుక రోజుకు తగిన మోతాదులో మాత్రమే కాఫీ, టీలను తాగాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
4.ఆస్తమాను తగ్గించేందుకు అల్లం కూడా పనికొస్తుంది. ఇది శ్లేష్మాన్ని తొలగిస్తుంది. వాయుమార్గాలను వెడల్పు చేస్తుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. ఆస్తమా తగ్గుతుంది. రోజూ ఉదయాన్నే అల్లం రసం సేవించాలి. లేదా భోజనంలో అల్లం తీసుకోవచ్చు. అల్లం డికాషన్ కూడా తాగవచ్చు.
5.యూకలిప్టస్ ఆస్తమాను తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీర్ఘకాలిక మంటను తొలగిస్తుంది. వాయుమార్గంలో వాపులు తగ్గుతాయి. నాసికా మార్గాల్లో ఉండే శ్లేష్మం తొలగించబడుతుంది. ఒక ఖర్చీఫ్ మీద కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి దాన్ని నిద్రించేటప్పుడు ముక్కుకు దగ్గరగా పెట్టుకోవాలి. లేదా మరుగుతున్న నీటిలో యూకలిప్టస్ ఆయిల్ చుక్కలను వేసి ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. దీని వల్ల కూడా వాయుమార్గాలు క్లియర్ అవుతాయి. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
*గమనిక:-* ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే వైద్యుల సలహా మేరకు అన్ని ఆచరించగలరు.