ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి…..

ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి…

హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌ – గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి

బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ

వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో కల్పికపై దాడికి దిగిన పబ్ సిబ్బంది

తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక

పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారంటూ ఆరోపించిన నటి కల్పిక…

కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు….

సినీనటి కల్పిక (Kalpika) పై గచ్చిబౌలి పబ్(Pub) లో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవకు దిగినట్టు సమాచారం. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ (Cake)విషయంలో కల్పిక పబ్ యాజమాన్యంతో గొడవకు దిగడంతో పబ్ నిర్వాహకులు కూడా ఆమెపై దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అయితే ఈ గొడవ అనంతరం నిర్వాహకులు కానీ, నటి కల్పిక కానీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయకపోవడంతో ఈ దాడి పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్ కు కల్పిక వెళ్లి బర్తడేకు సంబంధించిన కేక్ ఆర్డర్ చేశారు. అయితే ఈ కేక్ విషయంలో ఆమె పబ్ యాజమాన్యంతో గొడవకు దిగి వారిపై బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఇక వారు కూడా ఈమెపై దురుసుగా ప్రవర్తిస్తూ తను ఒక డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగారని సమాచారం. ఇలా ఇరువురి మధ్య చోటు చేసుకున్న ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది జోక్యం చేసుకొని శాంతింప చేయటంతో ఈ గొడవ సద్దుమణిగినట్టు తెలుస్తుంది. ఇలా పబ్ యాజమాన్యంతో ఇంత పెద్ద గొడవ జరిగినప్పటికీ ఈమె మాత్రం ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం గమనార్హం…