మంత్రి సీతక్క శాఖలో రూ.30 కోట్లు స్కామ్..బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్..
కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ పథకంలో రూ.30 కోట్లు స్కామ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
అంగన్వాడి వర్కర్లకు 38,130 మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు రూ.54 కోట్లతో టెండర్లు పిలిచిన మంత్రి సీతక్క శాఖ
అయితే అంగన్వాడీలకు ఇచ్చే శాంసంగ్ A06 ఫోన్ ఖరీదు బహిరంగ మార్కెట్లో కేవలం రూ.8,499 ఉండగా, ఒక్క ఫోనుకు రూ.14,499 ఖర్చు అవుతుందని చూపించి, తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.30 కోట్ల అవినీతికి పాల్పడింది
ఈ ఫోన్లను బల్క్లో కొనాలని, రిటైలర్ వద్ద కొనొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ, బల్క్లో కొంటే రూ.6,000కు మాత్రమే దొరికే ఫోన్లను, రూ.14,499కి కొనుగోలు చేశామని చెప్పి రూ.30 కోట్ల స్కాముకు పాల్పడ్డారు అని ఆరోపణలు చేశారు..