సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధికారికంగా శ్రీ సీతారామచంద్రస్వామి కాలనీ అని నామకరణం చేయాలి : కొండ హరీష్ గౌడ్
భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* అధ్యక్షతన రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లకు శ్రీ సీతారామచంద్రస్వామి* వారి పేరును అధికారికంగా ప్రకటించాలని గృహ నిర్మాణ శాఖ డీఈఈ(DEE) గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది..
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల భూములు శ్రీరాములు వారి భూములని అవి దేవాదాయ శాఖ నుంచి ఆరోజు ప్రభుత్వం వారు తీసుకున్నారని, అదేవిధంగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఎప్పటినుంచో శ్రీరాములు వారి పేరు మీద విరాజిల్లుతుందని ప్రజలందరూ కూడా వాడుకలో అదే పేరుతో పిలుస్తున్నారని కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి ఆ కాలనీకి *శ్రీ సీతారామచంద్ర స్వామి* వారి పేరును అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది పట్టణంలో ఉన్న ప్రజలందరి కోరిక అని తెలియజేశారు. సహజంగా ప్రభుత్వానికి ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఏదైనా కట్టడాలకు భూమిని ఇచ్చినట్లయితే అక్కడ నిర్మించిన కట్టడాలకు వారి పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మానవత్వంగా ఆలోచించైనా దేవుడి భూములు తీసుకున్నారు కాబట్టి దేవుడి పేరు పెట్టాలని కోరారు. ఒకవేళ ఈ పేరు కాకుండా వేరే ఏదైనా పేరు పెట్టాలని కనుక ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఆలోచించినట్లయితే స్థానిక ప్రజలందరితో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, పట్టణ ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్ మరియు తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.