ట్రంప్ నన్ను రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు..!

ట్రంప్ నన్ను రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు!

ఎప్‌స్టీన్ కేసులో మరోసారి తెరపైకి వచ్చిన ఆరోపణలు.. వైట్‌హౌస్ ఖండన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ పోటీదారు బీట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపినట్లు అమెరికా హౌస్ జ్యుడీషియరీ కమిటీ డెమోక్రాట్లు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కూడా తనకు పరిచయం ఏర్పడిందని ఆమె వివరించినట్లు నివేదిక వెల్లడించింది. .

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. 1993 లో న్యూయార్క్ లోని ప్లాజా హోటల్ రూమ్ లో తనను బ్రూటల్ గా ఆయన అత్యాచారం చేశారని తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలోని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు బియాట్రిస్ క్యూల్ ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అయితే ఆమె ఆరోపణలను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ తీవ్రంగా ఖండించింది. డెమోక్రాట్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీకి అమెరికాలో ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇక ఎప్‌స్టీన్‌ ఫైల్స్ కు సంబంధించిన అంశాల్లో అధ్యక్షుడు ట్రంప్‌ కు ఎలాంటి సంబంధం లేదని.. ఆయనకు క్లీన్‌ చిట్ లభించిందని అధ్యక్షుడి ప్రతినిధి గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే…

హోటల్‌లో తనను బంధించి దుస్తులు చించేసి, దారుణంగా రేప్ చేశారని బియోట్రిస్ కియోల్ ఆరోపించారు. ఈ దాడిలో తనకు అనేక చోట్ల గాయాలై రక్తం కూడా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరిస్తూనే.. అమెరికా వీసా, యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాకుండా, మోడలింగ్ కాంటెస్ట్‌ల పేరుతో సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్‌తో కలిసి ట్రంప్ ఎంతోమంది యువతులను లైంగికంగా వేధించేవారని మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే బియోట్రిస్ కియోల్ చేసిన ఈ తీవ్రమైన లైంగిక ఆరోపణలను వైట్ హౌస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి…