మైనారిటీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..ప్రిన్సిపల్ రెహానా..

మైనారిటీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..ప్రిన్సిపల్ రెహానా.

హుజూర్ నగర్ బాలికల మైనారిటీ గురుకులంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రెహనా తెలిపారు.తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ మైనార్టీ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ జనవరి 18 వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు.ఆన్ లైన్ అప్లికేషన్ నమోదుకు ఫిబ్రవరి 28 చివరి తేదీ అని పేర్కొన్నారు.అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను వెబ్‌సైట్ www.tmreistelangana.cgg.gov.in.
లో నమోదు చేసుకోవాలని కోరారు.మరిన్ని వివరాలకు పాఠశాల సెల్ నెంబర్ 7995057973
సంప్రదించాలని తెలిపారు.