హైదరాబాద్కు రెయిన్ అలర్ట్..
GHMC పరిధిలో మరో 2 గంటల్లో మోస్తరు వర్షాలు
ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం గంటకు 30 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్న అధికారులు..
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్… రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం (ఆగస్టు 4) ఉదయం 8.30 గంటల వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది