హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం…!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వర్షం
పంజాగుట్ట, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడలో వర్షం
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం..

రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇవాళ యూపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు యూపీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని వెల్లడించింది. గత 16 రోజులుగా బిహార్‌ సరిహద్దు వద్దే రుతుపవనాలు ఆగిపోయాయని ఐఎండీ తెలిపింది..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం .

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది..

తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, అటు ఏపీలో కూడా

ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి…తీవ్రమైన వేడి కారణంగా హైదరాబాద్‌ సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొద్దిసేపటి కిందట అమీన్ పూర్ ప్రాంతంలో భారీ వర్షం పడింది. వర్షానికి తోడు ఈదురు గాలులు తోడయ్యాయి. వాయువ్య హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్సీ పురం, శంషాబాద్, మొయినాబాద్, నిజాంపేట్ వంటి పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది..