అడిలైడ్ వేదికగా ఓడిపోయిన టీమిండియా…

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఒక మాదిరి ఛేజింగ్ లో ఆసీస్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. షార్ట్ (74) తో పాటు కొనొల్లి (61), మిచెల్ ఒవేన్ (36) బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి గెలిచింది.
ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 2 వికెట్ల తేడాతో రెండో వన్డేలో కూడా ఓడిపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే 2-0 తేడాతోటీమిండియా పై 3 వన్డేల సిరీస్ ను సొంతం చేసుకుంది కంగారు జట్టు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యార్, హర్షిత రానా టీమిండియా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. అయినప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లలో ఇండియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది…

అడిలైడ్ వేదికగా ఓడిపోయిన టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. 17 సంవత్సరాల తర్వాత ఈ వేదికగా తొలి ఓటమి చవిచూసింది టీమిండియా. అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు టీమిండియా 15 వన్డేలు ఆడింది. ఇందులో తొమ్మిది మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దాదాపు 17 సంవత్సరాలుగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రికార్డ్ కొనసాగిస్తోంది టీమిండియా. అయితే ఆ అరుదైన రికార్డు ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ వేదికగా గిల్ కెప్టెన్సీ లోని టీమిండియా ఓటమి మూటగట్టుకుంది…