వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి.!

తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో టీ20లోనూ ఆ జోరు ప్రదర్శించింది. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయగా.. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. గత నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్ ఫామ్ అందుకున్నాడు. మరోసారి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. 41 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కూడా 22 బంతుల్లో 43 పరుగులతో సత్తాచాటాడు. తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీ బాదిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదే దూకుడు కొనసాగించాడు. 18 బంతుల్లో 40 రన్స్ చేసిన అతను తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా 18 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్(20), దూబె(7) నిరాశపర్చగా.. మిగతా వారు రెచ్చిపోయి ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. విండీస్ ముందు 250 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది…రాంచీ (JSCA International Stadium Complex, Ranchi ) వేదికగా విండీస్ తో రెండో మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసినా, వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా విధించిన 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది వెస్టిండీస్. ఈ క్రమంలో ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ (Sanju Samson) ఓపెనర్ గా బరిలోకి దిగి అదరగొట్టాడు. కేవలం 41 బంతులు ఎదుర్కొన్న సంజు శాంస‌న‌… 82 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 200 స్ట్రైక్ రేట్ తో ఇరగదీసాడు. బ్యాటింగ్ ఇరగదీసిన సంజు శాంస‌న్ సెంచరీ మాత్రం మిస్ చేసుకున్నాడు.

గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్.

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య జరిగిన తొలి T20 సందర్భంగా సంజు శాంసన్ (Sanju Samson) ఫస్ట్ డౌన్ లో వచ్చి విఫలమయ్యాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్…. సంజు శాంస‌న్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎందుకు ఆడుతున్నావురా? అన్నట్టుగా ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. అయితే రెండో T20 సందర్భంగా ఓపెనర్ గా దిగిన సంజు దుమ్ము లేపాడు. దీంతో సంజును మళ్లీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసించాడు. ఈ క్రమంలో గంభీర్ పై సంజు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా సంజుకు ఎక్కువగా చాన్సులు ఇవ్వాలని కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా వైభవ్ కోసం సంజు కెరీర్ నాశనం చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా, టీమిండియా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 249 పరుగులు సాధించింది

వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి
టీమిండియా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 249 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో వెస్టిండీస్ ఫినిష్ చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఐదు టి20 సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. ఈ రెండు జట్ల మధ్య మరో మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ హోప్ 102 పరుగులు చేయగా… రూథర్ ఫోర్డ్ 84 పరుగులతో రెచ్చిపోయాడు.