90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసిన భారత్..

కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి టీ 20 సిరీస్ ను సాధించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగులతో ఘన విజయం సాధించిన టీమిండియా…

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది..

ఇషాన్, తిలక్ బ్యాటింగ్ అద్భుతం..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికిందర్ రజా.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తన బ్యాటింగ్ వైఫల్యం కూడా జట్టుకు భారంగా మారిందని అంగీకరించాడు. ‘మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారు ఆడిన కొన్ని షాట్లు అమోఘం. ఈ రోజు వారు చూపిన నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం. మేం ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. ఫీల్డింగ్ మెరుగ్గా చేసి బౌలర్లకు అండగా నిలిచి ఉంటే వారు ప్రత్యర్థిపై మరింత అదనపు ఒత్తిడి తీసుకొచ్చేవారు. కానీ ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా భారత బ్యాటర్లదే.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు..

కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి టీ 20 సిరీస్.!

కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి టీ 20 సిరీస్ ను సాధించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగులతో ఘన విజయం సాధించిన టీమిండియా..మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్బ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 81, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్ లో జింబాబ్వే.. 17.5 ఓవర్లలోనే 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (32) టాప్ స్కోరరర్ గా నిలిచాడు. బౌలర్లలో అభిషేక్ శర్మ స్పిన్ మ్యాజిక్ తో మూడు వికెట్లు తీయగా, డెబ్యూటెంట్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. మూడో టీ20 ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.