భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వరదలపై దాయాదిని న్యూదిల్లీ అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది..ఈ మేరకు కొన్ని మీడియా కథనాలను ఉటంకిస్తూ పీటీఐ కథనం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలు నిలిచిపోయినప్పటికీ.. వరదలపై పాక్ ను భారత్ అప్రమత్తం (India alerts Pakistan) చేసి మానవత్వాన్ని చాటుకుంది.
భారీ వర్షాల (Heavy Rains) కారణంగా జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ పాక్ (Pakistan) అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ వంటి మీడియాల్లో కథనాలు వచ్చాయి. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ పంచుకునేవారు..ఇప్పుడు దౌత్య కార్యాలయం పాక్‌ను అప్రమత్తం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. భారత్ (India) అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపాయి. అయితే, దీనిపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దాయాదిపై తీవ్రంగా మండిపడిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నుంచి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీంతో వరదలు (Floods in Pakistan) సంభవించాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు..
దాయాదికి తావి వరదల గురించి భారత్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా ఈ సమాచారాన్ని పంపినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పాక్ మీడియా నివేదించింది. పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ తాత్కాలికంగా రద్దుచేసిన విషయం తెలిసిందే. . అయితే, దీనిని న్యూఢిల్లీగానీ, పాకిస్థాన్‌గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఒకవేళ ఇదే నిజమైతే ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్‌కు తొలిసారి భారత్ సింధూ నది జలాల గురించి దౌత్యమార్గాల్లో తొలిసారి సమాచారం ఇచ్చినట్టయ్యింది
వాస్తవానికి సింధూ, దాని ఉప-నదుల్లో నీటి మట్టాలు, వరదల గురించి ఒప్పందంలో భాగంగా కమిషనర్ల ద్వారా సమాచారం అందజేస్తారు. కానీ, ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో హైకమిషన్ ద్వారా అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు తావి నదికి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పాకిస్థాన్‌ను భారత్ అప్రమత్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు, నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ సమాచారం చేరవేసినట్టు తెలిపాయి. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే పాకిస్థాన్ అధికారులు తావీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను వరదలపై అప్రమత్తం చేసినట్టు చెప్పాయి.
హిమాలయాల్లోని టిబెట్‌లో ప్రారంభమయ్యే సింధు నది కశ్మీర్ గుండా ప్రవహించి, పాకిస్థాన్ అంతటా ప్రవహిస్తుంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు, దాని ఉపనదుల జలాలను ఎలా వినియోగించాలనేది ఈ ఒప్పందం నిర్ణయిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదీ వ్యవస్థ నుంచి భారతదేశానికి 20 శాతం.. మిగిలిన 80 శాతం నీటిని పాకిస్థాన్ వినియోగించుకుంటోంది. పశ్చిమ నదులు (సింధు, జీలం, చీనాబ్) పాక్‌కు.. తూర్పు నదులు (రావి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయించారు. అదే సమయంలో ఇది ప్రతి దేశం మరొక దేశానికి కేటాయించిన నదుల నిర్దిష్ట ఉపయోగాలను అనుమతిస్తుంది..