బంగ్లాదేశ్ పై భారత్ విజయం.. .
అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది.
తొలి మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసిన భారత్ తాజాగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ౧౮ పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ వైభవ్ సూర్యవంశీ (72), వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు(80) రాణించడంతో భారత్ అండర్ 19 జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ రిఫత్(37), కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో మ్యాచ్ ఆసక్తకరంగా మారింది. మధ్యలో భారీ వర్షం రావడంతో టార్గెట్‌ను 29 ఓవర్లలో 165 పరుగులుగా నిర్ణయించారు. ఇక్కడ నుంచీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి పైచే యి సాధించారు. విహాన్ మల్హోత్ర 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు…
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జింబాబ్వే లోని బులవాయే క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బంగ్లాదేశ్ అండర్ 19 వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ స్టేజి లో భాగంగా జరిగిన ఈ ఏడవ మ్యాచ్ లో డక్ వర్క్ లూయిస్ పద్ధతి ప్రకారం 18 పరుగుల తేడాతో విజయం సాధించింది అండర్ 19 టీమిండియా. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా 48.4 ఓవర్లు వాడిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టు 10 వికెట్లు నష్టపోయి 238 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ 67 బంతులలో 72 పరుగులతో రాణించాడు. అభిజ్ఞాన్ కుందు ఈ మ్యాచ్ లో 112 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. దీంతో టీమిండియా 238 పరుగులు సాధించగలిగింది.
అయితే ఈ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ అండర్ 19 మ్యాచ్ కు పదే పదే వర్షం అడ్డంకీ గా మారింది. వర్షం పడిన నేపథ్యంలో టార్గెట్ ను 165 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్ ను కూడా 29 ఓవర్లలో చేదించాలి. కానీ బంగ్లాదేశ్ మాత్రం చేతులెత్తేసింది. 28.3 ఓవర్లలో 148 పరుగులకు అండర్ 19 బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ ఇండియా 18 పరుగులతో విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్తున్న టీమిండియా.
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా దూసుకు వెళ్తోంది. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై (United States of America team ) విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఏ లో నాలుగు పాయింట్లు సాధించిన టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే సూపర్ సిక్స్ లోకి దూసుకు వెళ్లనుంది టీమిండియా..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.