ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిగురించిన ప్రేమ..ఇద్దరు యువతులు వివాహం…

సాధారణంగా ప్రేమకథల్లో అడ్డంకులు సహజం. కానీ, బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ప్రేమకథ సామాజిక కట్టుబాట్లను దాటి చర్చనీయాంశంగా మారింది. ఒకే మాల్‌లో పనిచేసే ఇద్దరు యువతులు ప్రేమించుకుని..

పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.

పూజ ( 21 ) కాజల్ ( 18 ) ఇద్దరు యువతులు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. వీరు బీహార్ లోని సుపోల్ జిల్లా లో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అబ్బాయిలపై ఆసక్తి లేదని రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామని చెప్పారు. కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్న పరస్పర అంగీకారం తో ఒకటైనారు. ఇప్పుడు ఈ జంట ఒక మాల్ లో పనిచేస్తూ జీవిస్తున్నారు…

గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు..

డిసెంబర్ 23 (మంగళవారం) రాత్రి త్రివేణిగంజ్‌లోని మేళా గ్రౌండ్ దేవాలయంలో వీరి వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. అక్కడ అగ్నిగుండం అందుబాటులో లేకపోవడంతో, ఒక గ్యాస్ స్టవ్ వెలిగించి దాని చుట్టూ ఏడడుగులు వేయడం గమనార్హం. పూజా గుప్తా వరుడి పాత్రను పోషించగా, కాజల్ వధువుగా మారింది…