రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు..

*రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు*

– హుజూర్ నగర్ లో 2 పరీక్ష కేంద్రాలు

– పరీక్ష రాయనున్న 468 మంది జూనియర్,
– 433 సీనియర్ విద్యార్ధులు

మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేపధ్యంలో నియోజకవర్గకేంద్రమైన హుజూర్ నగర్ లో ఇంటర్ పరీక్షల కోసం 2 పరీక్ష కేంద్రా లను ఇంటర్ అధికారులు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ పట్టణంలో గల 2 పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రియదర్శినీ జూనియర్ కళాశాలలో మొత్తంగా జూనియర్ ఇంటర్ పరీక్షలకు 468 మంది, సీనియర్ ఇంటర్ పరీక్షలకు 433 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు పరీక్షాకేంద్రాల్లో ఇప్పటికే పరీక్షల నిర్వహణ కోసం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 5 నుంచి 24 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, ఈనెల 6 నుంచి 25 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9గం,ల నుంచి మధ్యాహ్నం 12గం.ల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం హుజూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరిండెంట్గా బ్రహ్మచారి, డిపార్ట్మెంటల్ అధికారిగా
సునీత, అలాగే ప్రియదర్శినీ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరిండెంట్గా ప్రణతి, డిపార్ట్మెంటల్ అధికారిగా పానుగంటి రాజేష్ వ్యవహరిస్తారు.