వేదిక చెన్నై..65 రన్స్ తేడాతో కోల్‌కతాపై విజయం
నితీశ్ ఆల్‌రౌండ్‌షో..
చెలరేగిన క్లాసెన్, అభిషేక్, హెడ్
ఉనాద్కట్‌కు మూడు వికెట్లు..
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. లీగ్‌ను ఓటమితో ఆరంభించిన ఈ జట్టు గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తమ పవరేంటో చాటుకుంది. బ్యాటింగ్‌లో బెంబేలెత్తించడంతో పాటు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని వణికించింది. దీంతో ఇషాన్ కిషన్ సేన 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. క్లాసెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), అభిషేక్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48), హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), నితీశ్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 39) రాణించారు. ముజరబానికి నాలుగు, వైభవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), రింకూ (25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), ఆలెన్ (7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) ఫర్వాలేదనిపించారు. ఉనాద్కట్‌కు మూడు.. మలింగ, నితీశ్ కుమార్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నితీశ్ నిలిచాడు.