Fire Blazes Near Iranian Military Installation After Strike |
ఇరాన్ సైనిక స్థావరంపై దాడి!
=============================
ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్, బహారెస్తాన్ నగరంలోని కీలక సైనిక స్థావరంపై భారీ దాడి జరిగింది. ఈ దాడి అనంతరం ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి మరియు ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేసింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు ఈ క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడిలో కీలకమైన మందుగుండు సామగ్రి డిపో మరియు సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
ఇటీవల . ఇరాన్ అణు కేంద్రాలు, ప్రధాన సైనిక స్థావరాలు ఉన్న ఇస్ఫహాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారు. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో వెనకడుగు వేయదని ఈ చర్య ద్వారా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గతంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిచర్యగానే ఈ దాడిని భావిస్తున్నారు..