కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై ముంబై ఇండియన్స్ గెలుపు..!

వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును ముంబై తమ ఖాతాలో వేసుకోనుంది. ఈరోజు జరిగే మ్యాచ్ ముంబైకి 300 టి-20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా అత్యధిక (300 మ్యాచులు) టి-20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపిఎల్ ఫ్రాంచైజీగా ముంబై రికార్డు సృష్టించనుంది..
IPL 2026, MI vs KKR highlights: Mumbai beat Kolkata by six wickets …
ఐపీఎల్ 2026 సీజన్ తమ తొలి లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండయన్స్ తో ఆదివారం వాంఖడే స్టేడియంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది…కెప్టెన్ అజింక్య రహానే (40 బంతుల్లో 67, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. లార్డ్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. నిజానికి టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యం లభించినా, దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఒక దశలో 260 పరుగుల వరకు చేస్తుందనుకున్న కేకేఆర్.. ఆ తర్వాత కాస్త తక్కువ స్కోరుకే పరిమితమైంది…

కోల్‌కతా నైట్ రైడర్స్ అంటే రోహిత్ శర్మకు ప్రత్యేకమైన అభిమానం. ఆ జట్టుపై పరుగులు సాధించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు..

రహానే-అలెన్ మెరుపులు..
ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు ఓపెనర్లు ఫిన్ అలెన్ (37), రహానే అద్భుతమైన శుభారంభం అందించారు. వీరిద్దరూ బౌండరీలు చెలరేగడంతో కేకేఆర్ స్కోరు బోర్డు వేగంగా సాగింది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగించిన అలెన్.. ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తా చాటాడు. మరో ఎండ్ లో రహానే కూడా సత్తా చాటడంతో 32 బంతుల్లోనే 69 పరుగులను వీరిద్దరూ జోడించారు. ఆ తర్వాత అలెన్ వెనుదిరిగినా రహానే జట్టును ముందుండి నడిపించాడు. వన్ డౌన్ లో వచ్చిన లీగ్ లోనే అత్యంత ఖరీదైన ఓవర్సీస్ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (18) విఫలమయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న రహానే, రఘువంశీ (29 బంతుల్లో 51, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన రహానేను శార్దూల్ పెవిలియన్ కు పంపాడు.

రఘువంశీ జోరు..
రహానే వెనుదిరిగిన తర్వాత రఘువంశీ జోరు పెంచాడు. ఘజన్ ఫర్ బౌలింగ్ లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రఘువంశీ.. ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా శార్దూల్ బౌలింగ్ లో బ్యాక్ హ్యాండ్ పంచ్ కొట్టిన సిక్సర్ హైలెట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత 28 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన రఘువంశీ పెవిలియన్ కు చేరాడు. చివర్లో హిట్టర్ రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు) కాస్త జోరు చూపించడంతో ముంబై 220 పరుగుల మార్కుకు చేరింది. బౌలర్లలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే ముంబై రికార్డు ఛేజింగ్ చేయాల్సిందే. ఇప్పటివరకు ఆ జట్టు చేసిన అత్యధిక ఛేదన 219 కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తే, తమ సక్సెస్ఫుల్ ఛేజింగ్ ను సవరించుకుంటుంది. ఇక 2012 తర్వాత తమ తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు. ఈ మ్యాచ్ లో గెలిచి, 14 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు..

కోల్‌కతాపై అద్భుతమైన గణాంకాలు..

నైట్ రైడర్స్‌తో ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ సగటు 38గా ఉండటం విశేషం. ఈ జట్టుపై ఆయన ఒక అద్భుతమైన శతకంతో పాటు ఆరు అర్ధ శతకాలు బాదారు. 127 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తూ కోల్‌కతా బౌలర్లకు ఎప్పుడూ సవాలు విసురుతుంటారు. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు కాగా, మిగిలిన ఇద్దరు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ.

అగ్రస్థానంలో నిలిచిన భారత వీరుడు..

కోల్‌కతాపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ (1021), శిఖర్ ధావన్ (907), సురేష్ రైనా (829) ఉన్నారు. ఈ రికార్డు రోహిత్ శర్మలోని నిలకడను, ముఖ్యంగా కోల్‌కతా జట్టుపై ఆయనకున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ అద్భుత ప్రదర్శనతో సామాజిక మాధ్యమాల్లో రోహిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు..